
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): దీని వడ్డీ రేటు సంవత్సరానికి 7.10% ఉంటుంది. ప్రయోజనాలు విషయానికి వస్తే పన్ను రహిత వడ్డీ, 15 సంవత్సరాల లాక్-ఇన్, సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు. దీర్ఘకాలికంగా సురక్షితం, కాంపౌండింగ్ కారణంగా మంచి రాబడి.

జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC): దీని వడ్డీ రేటు సంవత్సరానికి 7.7%గా ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రభుత్వ హామీ, సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనలు లభిస్తాయి. 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిలో స్థిర వడ్డీ ఉంటుంది. దీంతో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.

కిసాన్ వికాస్ పత్ర (KVP): ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వడ్డీ రేటు సంవత్సరానికి 7.5% లభిస్తుంది. ఇది దాదాపు 115 నెలల్లో (సుమారు 9.5 సంవత్సరాలు) మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును రెట్టింపు చేస్తుంది. సురక్షితమైనది. అలాగే గ్రామీణ, పట్టణ పెట్టుబడిదారులలో అనువైనది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): ఇందులో ఇన్వెస్ట్ చేసినవారికి సంవత్సరానికి 8.2% (త్రైమాసిక చెల్లింపులు) వడ్డీ రేటు ఉంటుంది. దీనిలో ప్రభుత్వ హామీ, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు, రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పరిమితి వంటి ప్రయోజనాలు ఉంటాయి. పదవీ విరమణ చేసిన వారికి, సీనియర్ సిటిజన్లకు అనువైనది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు): మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే పెద్ద బ్యాంకుల్లో 6.6%–7%, సీనియర్ సిటిజన్లకు 7%–7.5% వడ్డీ రేట్లు ఉన్నాయి. కొన్ని చిన్న బ్యాంకులు 8%–8.25% వరకు ఆఫర్ చేస్తాయి. ఇది ఎంతో సురక్షితమైన, సులభమైన పెట్టుబడి ఎంపిక, కానీ వడ్డీ రేటుపై పన్ను ఉంటుంది.