Silver Price: వామ్మో.. ఒక్కసారిగా దూసుకెళ్లిన వెండి ధర! ఒక్క రోజులోనే ఎంత పెరిగిందంటే?

Updated on: May 12, 2026 | 12:12 PM

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులో రూ.15,000 ఎగబాకి, కిలో రూ.3 లక్షల మార్క్ చేరింది. బంగారం ధరలు కూడా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్, భూ-రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.

1 / 5
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులోనే రూ.15 వేల మేర ఎగబాకి, చాలా రోజుల తర్వాత కిలో ధర రూ.3 లక్షల మార్క్‌ను తాకింది. గత రెండు రోజుల్లో మొత్తం రూ.20 వేల పెరుగుదల నమోదవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపడం వంటి కారణాల వల్లే ఈ పెరుగుదల కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

2 / 5
బంగారం ధరలు కూడా ఇదే దిశగా పయనిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,53,980కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.1,41,150గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, డాలర్ మార్పిడి విలువల ప్రభావం వల్ల బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

3 / 5
ఇటీవల మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వెండిపై పారిశ్రామిక వినియోగం కూడా అధికంగా ఉండటంతో ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి.

4 / 5
దీంతో పెట్టుబడిదారులు, నగల కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.

5 / 5
జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నులు ఆధారంగా తుది ధర మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు కొంత ఆచితూచి వ్యవహరిస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం భవిష్యత్ ధరలపై ఆశావహంగా ఉన్నారు.

Follow Us