
మీరు బ్యాంక్ అకౌంట్‌ను కొన్నేళ్ళ పాటు వాడకుండా అలా ఉంచితే ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అయిపోతుంది. దీని వల్ల మీరు అకౌంట్లోని డబ్బులను తీసుకోలేరు. అలాగే బ్యాంక్ ఖాతాదారుడు మరణించిన సమయంలో ఆ అకౌంట్లోని డబ్బులను ఎలా తీసుకోవాలో కుటుంబసభ్యులు చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఆర్బీఐ ఇందుకోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా డబ్బులు సులువుగా తీసుకోవచ్చు.

పాత బ్యాంక్ అకౌంట్లను గుర్తించడంతో పాటు అకౌంట్లో డబ్బులను క్లెయిమ్ చేసుకునేందుకు ఆర్బీఐ కొత్త పద్దతి తీసుకొచ్చింది. ఈ విధానంతో మీరు సెకన్లలోనే డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్‌క్లెయిమ్డ్ ఫారం నింపి ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ధృవీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి అందించండి.

అనంతరం బ్యాంక్ సిబ్బంది ఈకేవైసీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. మీ అకౌంట్లోని డబ్బులను వడ్డీతో సహా సిబ్బంది తిరిగి ఇచ్చేస్తారు. ఇక ఖాతాదారుడు చనిపోయిన సమయంలో నామినీకి డబ్బులు అందిస్తారు. ఇక ఫిక్స్ డ్ డిపాజిట్ల సొమ్మును కూడా ఇదే తరహాలో క్లెయిమ్ చేసుకోవచ్చు.

10 ఏళ్లు వాడిన పొదుపు, కరెంట్ అకౌంట్లు, మెచ్యూర్ పూర్తయిన క్లెయిమ్ చేసుకోని ఫిక్స్ డ్ డిపాజిట్లు, బకాయిలను సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన లోన్ లేదా క్యాష్ క్రెడిట్ అకౌంట్ల బ్యాలెన్స్, డ్రాఫ్ట్, పే ఆర్డర్, బ్యాంకర్ చెక్కులు, నెఫ్ట్ బదిలీలు వంటి క్లెయిమ్ చేయని లావాదేవీల, ప్రీపెయిడ్ కార్డులలో ఉపయోగించని బ్యాలెన్స్‌లు అన్‌క్లెయిమ్డ్‌గా భావిస్తారు.

ఇక రూపాయికి సమానమైన విదేశీ కరెన్సీ డిపాజిట్లు కూడా ఇదే కేటగిరీలో ఆర్బీఐ చేర్చింది. బ్యాంకులు నెలవారీగా ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను సమీక్షించాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇనాక్టివ్ అయ్యే అకౌంట్లోని నిధులను డిఈఏకు బదిలీ చేయాల్సి ఉంటుంది