
Stock Market: 2025 సంవత్సరం చివరి నెల 'డిసెంబర్' సోమవారం నుండి ప్రారంభమవుతుంది. NSE అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్‌లో వారాంతపు సెలవులు కాకుండా, మొత్తం నెలలో ఒకే ఒక ట్రేడింగ్ సెలవు ఉంటుంది.

అంటే భారత స్టాక్ మార్కెట్ వచ్చే నెలలో మొత్తం 9 రోజులు మూసి ఉండనుంది. డిసెంబర్‌లో ఏకైక సెలవుదినం డిసెంబర్ 25 (క్రిస్మస్). ఆ రోజు మార్కెట్ మూసి ఉంటుంది.

అదనంగా, స్టాక్ మార్కెట్ నెలలోని నాలుగు శనివారాలు అంటే 'డిసెంబర్ 6, డిసెంబర్ 13, డిసెంబర్ 20, డిసెంబర్ 27, నాలుగు ఆదివారాలు అంటే 'డిసెంబర్ 7, డిసెంబర్ 14, డిసెంబర్ 21, డిసెంబర్ 28' తేదీల్లో మూసి ఉంటుంది.

దీని వలన సంవత్సరం ముగిసే ముందు డిసెంబర్‌లో పెట్టుబడిదారులకు మొత్తం 22 ట్రేడింగ్ సెషన్‌లు లభిస్తాయి. 2025 సంవత్సరంలో BSE, NSE మొత్తం 14 సెలవులను పాటించాయి.

నవంబర్ 28 శుక్రవారం నాడు భారత స్టాక్ మార్కెట్ దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. ఎందుకంటే పెట్టుబడిదారులు అధిక స్థాయిలలో లాభాలను బుక్ చేసుకున్నారు. GDP (Q2) డేటా కంటే ముందు జాగ్రత్తగా తమ వైఖరిని కొనసాగించారు.