Electric two-wheelers: ఈ-బైక్‌ల రేంజ్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే.. సింగిల్‌ చార్జ్‌ పై ఏకంగా 320 కిమీ..

|

May 08, 2023 | 10:30 AM

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రధానమైనది బ్యాటరీ. బ్యాటరీ సామర్థ్యం బాగుంటే.. ఫీచర్లు కొంచెం అటుఇటుగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఒకవేళ బ్యాటరీ బాగుండి, అధిక రేంజ్‌ ఇవ్వడంతో పాటు అత్యాధునిక ఫీచర్లు కూడా ఉంటే అది వినియోగదారులకు బంపర్ బోనాంజానే. సరిగ్గా ఇదే విషయంపై కంపెనీలు ఫోకస్‌పెట్టాయి. బ్యాటరీ చార్జింగ్‌ సమయాన్ని తగ్గించడంతో పాటు అధిక మైలేజీ ఇచ్చే బ్యాటరీలను ఉత్పత్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు అధిక రేంజ్‌తో పాటు మంచి ఫీచర్లతో మార్కెట్లో రిలీజ్‌ చేశాయి. అలాంటి వాటిల్లో బెస్ట్‌ ఈ-బైక్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.. మీరూ ఓ లుక్కేయండి..

1 / 5
గ్రావ్‌టన్‌ క్వాంటా@ 320కిమీ.. దేశీయ మార్కెట్లో అత్యధిక మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్‌ మోపెడ్‌ ఇదే. దీనిలో రెండు స్వాపబుల్‌ బ్యాటరీలు ఉంటాయి. ఈ రెండింటి ద్వారా బైక్‌ 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. దీనిలో 3kW బీఎల్‌డీసీ ఉంటుంది. ఇది గరిష్టంగా 172ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్‌ అనే మూడు మోడ్లు ఉంటాయి. 250కేజీలను సునాయాసంగా మోయగలుగుతుంది. దీని ధద రూ. రూ. 99,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

2 / 5
అల్ట్రావయోలెట్‌ ఎఫ్‌77@ 307కిమీ.. దేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ రేంజ్‌ ఇచ్చే స్పీడ్‌ బైక్‌ లలో ఇదీ ఒకటి. 10.3kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌పై 307కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. 95ఎన్‌ఎం గరిష్ట టార్క్, 38.8 బీహెచ్‌పీ గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేసే పర్మనెంట్ మాగ్నెట్ ఏసీ మోటార్‌ దీనిలో ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో సున్నా నుండి 60కిమీల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 152కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీని ధర రూ. 4,55,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

3 / 5
ఐవూమీ ఎస్‌1@ 240కిమీ.. ఈ స్కూటర్‌లో 4.2కిలోవాట్లలిథియం అయాన్‌ బ్యాటరీ ఉంటుంది. 1.6హెచ్‌పీ గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేసే 1.2కిలోవాట్ల మోటార్‌ దీనిలో ఉంటుంది. ఇది ఎకో మోడ్‌లో 240కిమీ రేంజ్‌ను అందిస్తోంది, వేగం గంటకు గరిష్టంగా 40కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ.69,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

4 / 5
ఓలా ఎస్‌1@ 181కిమీ.. దీనిలో 4kWh  సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల చార్జ్‌ పై 181కిలోమీటర్లు అందిస్తుంది.ఇది గరిష్టంగా గంటకు 116కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 7-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్, టెక్, మ్యూజిక్ ప్లేబ్యాక్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర 1,24,999 (ఎక్స్-షోరూమ్).

5 / 5
విడా V1 ప్రో@165 కిమీ.. హీరో నుంచి వస్తున్న బెస్ట్‌ మోడల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇది. దీనిలో 3.94kWh రిమూవబుల్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌పై 165కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. దీనిలో 5.2 bhp, 25Nm గరిష్ట టార్క్‌తో ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఈ స్కూటర్‌ 3.2 సెకన్లలో 40కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 82కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. దీని ధర రూ. 1,39,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.