సీనియర్ సిటిజెన్స్ కోసం ఎస్బీఐ అమలు చేస్తున్న ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలపరిమితితో వస్తుంది. ఒక సంవత్సరం కాలపరిమితితో వచ్చే ఎఫ్డీపై వడ్డీ రేటు 7.30శాతంగా ఉంటుంది. అలాగే మూడుసంవత్సరాల కాల పరిమితితో వచ్చే స్కీమ్ లో వడ్డీ 7.25శాతంగా ఉంటుంది. అదే ఐదేళ్ల కాలపరిమితితో వచ్చే ఎఫ్డీపై 7.50శాతం వడ్డీ రేటు వస్తుంది.
ఎస్బీఐ సీనియర్ సిటిజెన్ ఎఫ్డీ పథకంలో ఎంత పెట్టుబడికి ఎంత మొత్తం రాబడి ఉంటుందో ఓ సారి పరిశీలిద్దాం.. ఒక సంవత్సరం కాలవ్యవధితో మీరు రూ. 5లక్షలు పెట్టుబడి పెడితే దానిపై వడ్డీ రేటు 7.30శాతం కాబట్టి మీకు వడ్డీనే రూ. 37,511 లభిస్తుంది. మొత్తం వ్యవధి పూర్తయ్యే సమయానికి అంటే మెచ్యూరిటీ నాటికి మీ కార్పస్ రూ. 5,37,511 అవుతుంది.
ఎస్బీఐ సీనియర్ సిటిజన్ ఎఫ్డీ మూడేళ్ల కాలపరిమితితో తీసుకుంటే రూ. 5లక్షలు పెట్టుబడి పెడితే.. దీనిలో వడ్డీ రేటు 7.25శాతం కాబట్టి మీరు వడ్డీనే రూ. 1,20,273 పొందుతారు. మూడేళ్ల కాలపరిమితి పూర్తయ్యే నాటికి అంటే మెచ్యూరిటీ సమయానికి మీ మొత్తం కార్పస్ రూ. 6,20,273 అవుతుంది.
అదే సమయంలో ఎస్బీఐ సీనియర్ సిటిజన్ ఎఫ్డీని 5 సంవత్సరాల కాలపరిమితితో రూ. 5లక్షలను పెట్టుబడి పెడితే మీకు వడ్డీ రేటు 7.50గా ఉంటుంది. అప్పుడు వడ్డీనే మీకు రూ. 2,24,974 వస్తుంది. అసలు, వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 7,24,974 అవుతుంది.
మొత్తం మీద ఈ ఎస్బీఐ ఎఫ్డీ సీనియర్ సిటిజెన్స్ కు బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో అధిక వడ్డీతో పాటు అధిక భద్రత కూడా ఉంటుంది. దీనిలో ఐదేళ్ల మెచ్యూరిటీ కాలానికి రూ. 5లక్షలు పెట్టుబడి పెడితే దానిపై వడ్డీనే మీరు రూ. 2,24,974 వరకూ పొందొచ్చు.