
టీవీఎస్ జూపిటర్.. టీవీఎస్ నుంచి అత్యంత జనాదరణ పొందిన స్కూటర్లలో ఇదీ ఒకటి. జూపిటర్లో డిజిటల్ స్పీడోమీటర్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్-ఫిల్లర్, ఇంజిన్ కిల్ స్విచ్, ఆల్ ఇన్ వన్ లాక్, ఐ టచ్ స్టార్ట్, మొబైల్ ఛార్జర్, డ్యూయల్ సైడ్ హ్యాండిల్ లాక్, అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్, గ్యాస్ చార్జ్డ్ రియర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అలాగే బ్లూటూత్ పెయిరింగ్ కోసం స్మార్ట్ ఎక్సోనెక్ట్ ఆప్షన్ ఉంటుంది.

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఇదీ ఒకటి. దీని డిజైన్, లుక్, ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పైగా ఎలక్ట్రిక్ వేరియంట్ కావడంతో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీనిలో 3జీబీ ర్యామ్, హై స్పీడ్ ప్రాసెసర్ తో పాటు ఏడా అంగుళాల టచ్ స్క్రీన్ తో కూడిన డ్యాష్ బోర్డు ఉంటుంది. జియో-ఫెన్సింగ్, మ్యాప్ నావిగేషన్ కోసం జీపీఎస్, బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్‌లు, బ్లూటూత్ స్పీకర్లు ఉంటాయి.

యమహా రే-జెడ్ఆర్ 125 హైబ్రిడ్.. ఈ బైక్ స్మార్ట్ మోటార్ జనరేటర్(ఎస్ఎంజీ) ఉంటుంది. ఇందులోని బ్యాటరీ 6.0 kW సామర్థ్యంతో ఉంటుంది. మోటార్ 8.2 బీహెచ్పీ, 10.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ ఫీచర్లు, పాస్ స్విచ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్లూటూత్‌తో పూర్తి డిజిటల్ స్క్రీన్ (వై-కనెక్ట్ యాప్) వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 83,730 ఎక్స్ షోరూం ఉంటుంది.

హోండా యాక్టివా హెచ్-స్మార్ట్.. యాక్టివా.. భారతీయ స్కూటర్ల మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోంది. ఇప్పుడు కంపెనీ కొత్త యాక్టివా హెచ్-స్మార్ట్ మోడల్‌ను దేశంలో ప్రవేశపెట్టింది, ఇది ఫీచర్-లోడెడ్ గా అందుబాటులోకి వచ్చింది. కీలెస్ యాక్సెస్ కోసం స్మార్ట్ రిమోట్ కీతో వస్తుంది. అలాగే స్మార్ట్ ఇంజిన్ ఇమ్మొబిలైజర్‌తో వస్తుంది. ఇది దొంగతనం లేదా స్కూటర్‌కు అవాంఛిత యాక్సెస్ నుండి సురక్షితంగా ఉంచుతుంది. దీని ధర రూ. 80,537 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్125.. ఈ స్కూటర్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, డిజిటల్ స్పీడోమీటర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి పీచర్లతో వస్తోంది. దీని ధర రూ. 79,356 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.