1 / 5
రిమూవబుల్ బ్యాటరీ.. హీరో విడా వీ1 ప్రో అత్యధికంగా అమ్ముడవుతోంది. రిమూవ్ చేయగల బ్యాటరీలు ఉండడం దీని ప్రత్యేకత. వినియోగదారులు బ్యాటరీ ప్యాక్‌లను బయటకు తీసి, వాటిని చార్జింగ్ చేయడానికి ఇంటికి తీసుకెళ్లవచ్చు. వీటిని బండి నుంచి చాలా సులభంగా తొలగించే వీలుంది. ఉదాహరణకు మీరు అపార్టుమెంట్ లో నివసిస్తున్నారు. మీరు బండి పార్కింగ్ చేసే చోట చార్జింగ్ పెట్టుకునే వీలు ఉండదు. అలాంటి సమయంలో బండిలోని బ్యాటరీలను బయటకు తీసి ఫ్లాట్ లో చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది.