1 / 6
హ్యూందాయ్ కోనా ఈవీ(Hyundai Kona EV).. ఈ ఎలక్ట్రిక్ కారులో 39.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 136 PS, 395 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 9.7 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 50 kW ఫాస్ట్ ఛార్జర్, 7.2 kW వాల్ బాక్స్ ఛార్జర్, 2.8 kW పోర్టబుల్ ఛార్జర్ ఉన్నాయి. 50 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీని 57 నిమిషాల్లో నే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. అనేక అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 23.84 లక్షల నుంచి రూ. 24.03 లక్షలు.