Fixed Deposit Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అత్యధిక వడ్డీని ఇచ్చే బ్యాంకులు ఇవే.. ఏకంగా 8శాతం వరకూ వడ్డీ..
సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినది ఫిక్స్‌డ్ డిపాజిట్. అధిక వడ్డీతో పాటు భద్రత, పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. ఏ బ్యాంకులో అధిక వడ్డీ ఉందో తెలుసుకోవడం కష్టం. సాధారణంగా దీని వడ్డీ రేటు 6.5 నుంచి 7.5 శాతం వరకూ ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు 8శాతం వరకూ కూడా ఎఫ్‌డీలపై వడ్డీని అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటో చూద్దాం..