- Telugu News Photo Gallery Business photos GST collections at Rs. 1,87,000 crore on 2024 October, highest since April, read in Telugu
GST Collections: ప్రభుత్వానికి కాసుల పంట.. అక్టోబర్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు!
GST Collections: 2024 అక్టోబర్ GST వసూళ్లు: వరుసగా ఎనిమిదో నెలలో భారతదేశంలో GST వసూళ్లు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. నవంబర్ 1న ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు దూసుకెళ్తున్నాయి. ఏప్రిల్‌లో 2.1 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా. ప్రస్తుతం అంతకు మించి వసూలు అయ్యాయి..
Updated on: Nov 02, 2024 | 11:00 AM

భారత్‌లో వస్తు, సేవల పన్నుల పంట కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో ప్రభుత్వానికి రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ ట్యాక్స్ వచ్చింది. గత ఆరు నెలల్లో వసూలు చేసిన జీఎస్టీలో ఇదే అత్యధికం. గత ఎనిమిది నెలల నుంచి ప్రతి నెలా కనీసం 1.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం విశేషం.

సెప్టెంబర్ 2024లో GST వసూళ్లు రూ. 1,73,240 కోట్లు. అక్టోబర్ 2023 నెలలో GST రూ. 1.72 లక్షల కోట్లు వసూలు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. నెలకు జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం పెరిగింది. సంవత్సరానికి శాతం. 8.9 శాతం పెరిగింది.

ఏప్రిల్ 2024లో జీఎస్టీ వసూళ్లు రూ. 2.1 లక్షల కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొలి త్రైమాసికంలో సగటు పన్ను వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లు.

రెండో త్రైమాసికంలో జూలై-సెప్టెంబర్ మధ్య నెలవారీ సగటు పన్ను వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లకు పడిపోయాయి. అయితే, గత ఎనిమిది నెలలుగా ప్రతి నెలా కనీసం రూ.1.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అవుతోంది.

పండుగల సీజన్‌లో భారీ వ్యాపార కార్యకలాపాల కారణంగా జీఎస్టీ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.




