
వివిధ ఆదాయ పన్ను కంప్లయెన్స్ సహా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు సహా సంబంధించిన గడువు తేదీని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.

కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పన్ను కంప్లయెన్స్‌కు సంబంధించిన వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు రావడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 సబ్ సెక్షన్ (5) కింద సవరించిన రిటర్నులు, సబ్ సెక్షన్ (4) కింద లేట్ రిటర్నులను ఈ ఏడాది మార్చి 31 లోపు సమర్పించాల్సి ఉండగా ఆ గడువు తేదీని మే 31 వరకు పొడిగించినట్లు సీబీడీటీ వెల్లడించింది.

అలాగే డిస్ప్యూట్ రిసొల్యూషన్ ప్యానల్ (డీఆర్‌పీ)కు సమర్పించాల్సిన అభ్యంతరాలు సహా కమిషనర్‌కు దాఖలు చేయాల్సిన ఫైలింగ్స్ గడువు తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు వెల్లడించింది.