Silver Price: మహిళలకు పండగలాంటి వార్త.. రికార్డ్‌ స్థాయిలో తగ్గుతున్న వెండి ధర..!

Updated on: Jul 18, 2026 | 9:36 PM

Silver Price: సురక్షిత పెట్టుబడుల కోసం చూస్తున్న పెట్టుబడిదారులు బంగారానికి ప్రాధాన్యత ఇవ్వగా, వెండిలో లాభాల స్వీకరణ పెరిగింది. దీనివల్ల దేశీయ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. వెండి ఒక పారిశ్రామిక లోహం కూడా. దీని ధరలు ప్రపంచ..

1 / 5
 Silver Price: దేశంలో వెండి ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ఒక వైపు బంగారం ధరలు దిగి వస్తుంటే అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. ఒకప్పుడు కిలో వెండి ధర 4 లక్షల రూపాయల వరకు వెళ్లగా ఇప్పుడు సగం వరకు దిగి వచ్చింది. ప్రపంచ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, వెండి ధర తగ్గుముఖం పడుతోంది. తాజాగా హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో వెండి రూ.5,000 వరకు తగ్గింది.

2 / 5
 సురక్షిత పెట్టుబడుల కోసం చూస్తున్న పెట్టుబడిదారులు బంగారానికి ప్రాధాన్యత ఇవ్వగా, వెండిలో లాభాల స్వీకరణ పెరిగింది. దీనివల్ల దేశీయ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. వెండి ఒక పారిశ్రామిక లోహం కూడా. దీని ధరలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయి.

3 / 5
 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక డిమాండ్‌పై అనిశ్చితి కారణంగా, పెట్టుబడిదారులు వెండిలో కొత్తగా కొనుగోళ్లు చేయడానికి వెనుకాడారు. ఈనెల 5వ తేదీన దేశంలో వెండి ధర 2.50,000 రూపాయల వరకు ఉండగా, ప్రస్తుతం 2.30,000 వరకు దిగి వచ్చింది. అంటే 20 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే గత నెల జూన్‌ 1వ తేదీన కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ట్రేడయ్యింది. అంటే గత నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు వెండి ధరను పరిశీలిస్తే కిలోపై ఏకంగా 50 వేల రూపాయల వరకు తగ్గిందనే చెప్పాలి.

4 / 5
 అలాగే గత  నెల 5వ తేదీన కిలో వెండి ధర రూ.2,75,000లకు చేరుకుంది. అదే జూన్‌ 10వ తేదీ నాటికి  రూ.2,50,000లకు చేరింది. ఇలా ఒడిదొడుకుల మధ్య వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల అదే తేదీన అంటే 18న కిలో వెండి ధర రూ.2.60,000 వద్ద స్థిరపడింది. గత నెల రోజులుగా వెండి ధరను పరిశీలిస్తే..30 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. రానున్న రోజుల్లో మరింత దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

5 / 5
 ఇక బంగారం విషయానికొస్తే శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 760 రూపాయలు పెరిగి 1,43,290 రూపాయల వద్ద ఉండగా, అదే 22 క్యారెట్లపై 700 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,31,350 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,07,470 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Follow Us