
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు రుణంపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. ఎస్‌బీఐ కార్ లోన్‌పై 8.65 శాతం నుంచి 9.70 శాతం వార్షిక వడ్డీని వసూలు చేస్తోంది. పండుగ సీజన్‌లో కార్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజును కూడా ఎస్‌బీఐ సున్నాకి తగ్గించింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కారు రుణం తీసుకుంటే, మీరు 8.75 శాతం నుండి 10.50 శాతం వరకు వడ్డీని చెల్లించాలి. బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తోంది.

దేశంలో ఈ పండుగ సీజన్‌లో యుకో బ్యాంక్ అతి తక్కువ రేటుకు కారు రుణాన్ని అందిస్తోంది. బ్యాంకు ఏడాదికి 8.45 శాతం నుంచి 10.55 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అలాగే యుకో బ్యాంకు లోన్ ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం 8.70 శాతం నుంచి 13 శాతం వార్షిక వడ్డీకి కార్ లోన్‌లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కార్ లోన్‌పై ఎటువంటి ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయడం లేదు

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం 8.70 శాతం నుంచి 12.10 శాతానికి కార్ లోన్‌ను అందిస్తోంది. మీరు బ్యాంకుకు లోన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.