
Gold, Silver Price Today:కొన్ని గంటల్లోనే బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. ఊహించనంత దెబ్బకొట్టాయి. భారీ స్థాయిలో ఎగబాకాయి. కాస్త తగ్గుముఖం పడుతున్నాయన్న ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఫిబ్రవరి 23న 11 గంటల సమయానికి బంగారం, వెండి ధరలు అప్‌డేట్ అయ్యాయి. ధరలను చూస్తే షాక్‌కు గురి చేసేలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 2,070 రూపాయలకు పెరిగింది. అదే 22 క్యారెట్ల ధరపై 1900 వరకు పెరిగింది.

ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై ఏకంగా 25 వేల రూపాయల వరకు రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షల రూపాయల వద్ద ట్రేడవుతోంది. ధరలు దిగి వస్తు్న్న తరుణంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

ధరలు పెరిగిన తర్వాత 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,61,350 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,900 వద్ద ఉంది. అలాగే 18 క్యారెట్ల ధర 1,21,010 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,350 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,47,900 వద్ద ట్రేడవుతోంది.