
బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే ధరలు తారుమారు అయ్యాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు డౌన్ పాల్ అవుతున్నాయి. దీంతో కొనుగోదారులకు ఊరట చెందగా.. ఇప్పుడు చేదువార్త అందింది. మంగళవారం ఉన్నట్లుండి గోల్డ్ రేట్లు ఆమాంతం పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే ధరల్లో్ భారీ మార్పు కనిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే దీని ధర రూ.1470 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,400 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో చూస్తే రూ.1350 హైక్ అయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ధరలను చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,310గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,550 వద్ద ట్రేడవుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,400 వద్ద ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,54,910గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.42 లక్షలుగా ఉంది.

అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,400గా ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,53,160 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,400గా ఉంది. అటు సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. బెంగళూరులో ధర కాస్త తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు.