
బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలైన క్రమంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజులుగా ధరల్లో పెరుగుదల నమోదవుతుండగా.. శనివారం మరోసారి అదే బాట పట్టాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం

దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.500 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,650 వద్ద ట్రేడవుతోండగా.. నేడు ఒక్కరోజే రూ.450 పెరుగుదల నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ధరలు పెరిగాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,230 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.3410 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,800 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో చూస్తే రూ.450 మేర పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల రేటు రూ.1,49,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,650 వద్ద ట్రేడవుతోంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,200 వద్ద ఉండగా.. శుక్రవారంతో పోలిస్తే రూ.650 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,600 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.600 పెరిగాయి. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,650 వద్ద ఉంది.

అటు వెండి ధరలు మాత్రమే స్ధిరంగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.2.70 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న రూ.2.65 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు పెరిగింది. అటు చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.70 లక్షల వద్ద కొనసాగుతోంది.