
రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూ, సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్స్ లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే. అయినా రోజు రోజుకు ధరలు పెరుగుతూ మధ్యతరగతి వారికి భారంగా మారుతున్నాయి. నేడు సెప్టెంబర్ 10 బుధ వారం రోజున బంగారం ధరలు భారీగా పెరిగాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

నేడు సెప్టెంబర్ 10 బుధ వారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,509 గా ఉంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,300 గా ఉంది.

సెప్టెంబర్ 09 మంగళ వారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,290 ఉండగా, నేడు సెప్టెంబర్10 బుధవారం రోజున రూ.219 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.1,10,509గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళ వారం రోజున రూ.101,100 ఉండగా, నేడు (బుధవారం) రూ.200 పెరగడంతో 1,01,300గా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,509 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,300 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,509 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,300వద్ద ఉంది