Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంత ఉందంటే..

Updated on: Apr 27, 2026 | 6:06 AM

Gold, Silver Prices Today: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం భారీగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. తాజాగా కూడా ధరలు దిగి వస్తున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

1 / 5
 Gold, Silver Prices Today: గత కొన్ని రోజులుగా పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత ప్రస్తుతం భారీగానే దిగి వస్తున్నాయి. ఈ వారం రోజుల్లో బంగారం ధరలను పరిశీలిస్తే కాస్త శాంతించాయనే చెప్పాలి. సామాన్యులకు ఇది కొంత ఊరట కలిగించే విషయమే అయినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ధరలు ఇంకా గరిష్ట స్థాయిలోనే ఉండటం గమనార్హం.

2 / 5
 ప్రస్తుతం ధరలు దిగి వస్తున్నప్పటికీ తాజాగా ఏప్రిల్‌ 27వ తేదీన స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,030 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,190 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే దేశీయంగా స్వల్పంగానే తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,69,900 వద్ద కొనసాగుతోంది.

3 / 5
 ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను చూస్తే.. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,030 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,190 వద్ద కొనసాగుతోంది. వెండి ధర విషయానికొస్తే కిలో కిలోకు రూ.2,69,900 వద్ద ట్రేడవుతోంది.

4 / 5
 ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,180 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,340 ఉంది. అదే ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,190 వద్ద కొనసాగుతోంది.

5 / 5
 ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటి? బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా దిగిరావడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం. భౌగోళిక రాజకీయ పరిస్థితులు కుదుటపడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం తగ్గించారు. రెండోది, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు తమ లాభాలను స్వీకరించడం మొదలుపెట్టారు. అంటే తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారు. ఈ పరిణామాల వల్ల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగొస్తున్నాయి

Loading...
Unable to load recommendations.
Follow Us