
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్ బయటకొచ్చింది. భవిష్యత్తులో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలో పెరిగి అత్యంత ఖరీదైన వస్తువుగా మారే అవకాశమున్నట్లు అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్ధిక విషయాలను అంచనా వేసే ప్రముఖ ఏజెన్సీలు, పెట్టుబడిదారులు పసిడి ధరలపై వెల్లడించే అంచనాలు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి గోల్డ్ ధరల గురించి వేసే అంచనాలు అందరిలోనూ ఆసక్తి పెంచుతాయి.

బంగారం కొని పెట్టుకోవాలని, భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశముందని ఆయన ఎప్పటినుంచో చెబుతూ వస్తూన్నారు. ఈ క్రమంలో మరో ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ పసిడి ధరలపై భారీ అంచనా వేశారు. ఎలక్ట్రమ్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ బంగారం పెట్టుబడిదారుడు థామస్ కాప్లాన్ సంచలన అంచనా వేశారు. ఆయన అంచనాలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

బంగారం ధరలు భవిష్యత్తులో పది రెట్లు పెరగవచ్చని ధామస్ కాప్లాన్ అంచనా వేశారు. ఏకంగా తులం బంగారం రూ.15 లక్షలకు చేరుకునే అవకాశముందని బాంబ్ పేల్చారు. అంటే తులం బంగారంతో ఒక లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చన్నమాట. ఇప్పుడు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన చెబుతున్నారు. బంగారం ఉన్నవారే భవిష్యత్తుల్లో బిలియనీర్లు అని చెప్పవచ్చు.

అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతోంది. అంతేకాకుండా భౌగోళిక ఉద్రిక్తతలు కూడా ధరల పెరుగుదలకు కారణం కానున్నాయి. ప్రపంచ ఆర్దిక పరిస్థితులు దిగజారడం, ద్రవ్యోల్బణం అదుపులో లేకపోతే రిజర్వ్ బ్యాంకులు వడ్డీ రేట్లలో కొత విధించడం వల్ల బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువమంది ముందుకొస్తారు. దీంతో పసడి ధరలు అనేవి భవిష్యత్తులో రికార్డ్ స్థాయిలో పెరుగుతాయని చెబుతున్నారు.

ఇప్పటికే అన్ని దేశాలకు సంబంధించిన కేంద్ర బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆర్ధిక సంక్షోభం ఏర్పడితే ఉపయోగపడతానే ఉద్దేశంతో నిల్వలను పెంచుకుంటున్నాయి. ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా నిలుస్తోంది.