
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు వారాలుగా గరిష్ట స్థాయిలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. డాలర్ రోజురోజుకి బలహీనపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందా..? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు పెరుగుతున్న క్రమంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బంగారం వైపు ఎక్కువమంది పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంచలన అంచనా వేసింది. బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశముందని తెలిపింది. పసిడి ధర ఔన్సుకు 5 వేల డాలర్లు దాటుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి ఔన్సుకు 4450 డాలర్లకు చేరుకుంటుందని, 2027 నాటికి ఔన్సుకు 5 వేల కంటే ఎక్కువ పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది.

ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచేందుకు తక్కువ అవకాశం ఉన్నందున ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ డిమాండ్ పుంజుకుందని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది. 2026 వరకు ఫెడ్ వడ్డీ రేట్లను యథాతధంగా కొనసాగించే అవకాశముందని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 5,600 డాలర్లకు చేరుకుని బంగారం ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉందని పేర్కొంది.

డాలర్ బలహీనపడటం, అమెరికా రుణ ఆందోళనల కారణంగా పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం పరుగులు తీస్తుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వ రుణం 40 ట్రిలియన్ల డాలర్లు దాటిన క్రమంలో బైబ్యాక్ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. దీంతో బంగారం ధరల్లో ర్యాలీ మొదలైనట్లు

కాగా ఆదివారం నాటికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,49,500 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,63,240 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,49,650గా ఉంది.