
శ్రావణ శుక్రవారం అంటేనే మహిళలందరికీ ముఖ్యమైన రోజు. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ ఉంటారు. దీంతో ఇది ముఖ్యమైన పండుగగా చెప్పవచ్చు. ఈ పండుగ రోజున మహిళలకు షాక్ తగిలింది. బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతుండటం, ఇరాన్‌పై ఆర్ధిక ఆంక్షలను తీవ్రతరం చేయాలని అమెరికా భావిస్తుండటంతో మార్కెట్లపై దీని ప్రభావం పడింది. ఈ క్రమంలో బంగారం ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి

హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,990గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,658 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,200గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,850 వద్ద కొనసాగుతోంది

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,870 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రైూ.1,46,548గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,510 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,218గా ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,740 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,218గా ట్రేడవుతోంది. కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,530గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,236 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,610 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2,45,940గా ఉండగా.. బెంగళూరులో రూ.2,45,420 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2,44,560 వద్ద కొనసాగుతోంది.