హమ్మయ్యా.. తగ్గాయిలే అనుకునేలోపే మళ్లీ పెరుగుతున్నాయి! బంగారం ధర మళ్లీ పెరిగేందుకు కారణమేంటంటే..?

Updated on: Feb 04, 2026 | 9:53 PM

పెళ్లిళ్లకు తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అనూహ్యంగా దూసుకెళ్తున్నాయి. డాలర్ ఇండెక్స్ తగ్గుదల, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ కారణాలతో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. రెండు రోజుల్లో బంగారం రూ.12,000, వెండి రూ.38,000 పైగా పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి.

1 / 5
ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీ తగ్గుదల చూశాయి. దీంతో పెళ్లిళ్లకు రెడీ అయినా కుటుంబాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. హమ్మయ్యా ధరలు కాస్త తగ్గుతున్నాయిలే అనుకునేలోపే మళ్లీ పెరుగుదల మొదలైంది. పెట్టుబడిదారులు సంతోషపడుతున్నా.. సామాన్యులు మాత్రం ధరల పెరుగుదలతో సంతోషంగా లేరు. మరి తగ్గినట్టే తగ్గి మళ్లీ బంగారం ధరలు పెరిగేందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

2 / 5
డాలర్ ఇండెక్స్ తగ్గుదల, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను మళ్లీ పెంచుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు కేవలం రెండు రోజుల్లోనే రూ.38,000 కంటే ఎక్కువ పెరిగాయి, వెండి ధర మరోసారి రూ.3 లక్షలకు దగ్గరగా ఉంది.

3 / 5
రెండు రోజుల్లో బంగారం ధరలు రూ.12,000 లకు పైగా పెరిగాయి, ప్రస్తుతం బంగారం రూ.1.65 లక్షలకు చేరుకుంది. దేశ ఫ్యూచర్స్ మార్కెట్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కూడా ఇలాంటి పెరుగుదల కనిపిస్తోంది. డాలర్ క్షీణించి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరిష్కారమయ్యే వరకు, బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

4 / 5
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వెండి ధర కిలోగ్రాముకు రూ.14,300 లేదా 5.03 శాతం పెరిగి రూ.2,98,300 కు చేరుకుంది (అన్ని పన్నులతో సహా). గత సెషన్‌లో వెండి కిలోగ్రాముకు రూ.2,84,000 వద్ద ముగిసింది. ముఖ్యంగా వెండి ధరలు ఇప్పటికే కిలోగ్రాముకు రూ.38,300 పెరిగాయి. ఇంతలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం కూడా బాగా పెరిగి రూ.7,400 లేదా 4.69 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,65,100 (అన్ని పన్నులతో సహా)కు చేరుకుంది. మంగళవారం 10 గ్రాములకు రూ.1,57,700తో ముగిసింది. బంగారం ధరలు ఇప్పటికే రెండు రోజుల్లో 10 గ్రాములకు రూ.12,400 పెరిగాయి.

5 / 5
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం, వెండి ధరలు బుధవారం కొత్తగా కొనుగోళ్లకు దారితీశాయని HDFC సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ అన్నారు. ఈ ప్రతిష్టంభన ఈ వారం చివర్లో జరగనున్న అమెరికా-ఇరాన్ అణు చర్చలపై ఆశలను దెబ్బతీస్తుందని, అమెరికా, ఇరాన్ మధ్య మరింత ఘర్షణకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు, ఇది బంగారంపై రిస్క్ ప్రీమియంను పెంచుతుంది, సురక్షితమైన ఎంపికగా విలువైన లోహాలకు డిమాండ్‌ను పెంచుతుంది.