Gold Rates Today: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి భారీగా పతనం.. ఒకేరోజు ఎంత తగ్గిందంటే..?

Updated on: Feb 05, 2026 | 10:02 AM

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఒక్కసారిగా గంటల వ్యవధిలోనే ధరలు పతనమయ్యాయి. ఎంసీఎక్స్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే ధరలు కుప్పకూలాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌తో పాటు వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.

1 / 5
బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గోల్డ్ రేట్ల పెరుగుదలకు మళ్లీ బ్రేక్ పడింది. గత ఐదు రోజులుగా ధరలు పతనమవ్వగా.. బుధవారం కాస్త పెరిగాయి. గురువారం మళ్లీ ధరలు కప్పకూలాయి. గంటల వ్యవధిలోనే బంగారం ధరలు సీన్ రివర్స్ అయ్యాయి. ఇక వెండి ధరలు కూడా అదే బాటలో నడిచాయి.

2 / 5
ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,54,420 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,59,440గా ఉండగా.. బుధవారంతో పోలిస్తే ధర రూ.5020 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,550గా ఇప్పుడు ఉంది. నిన్న  ఇది రూ.1,46,150గా ఉండగా.. రూ.4600 తగ్గింది.

3 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా హైదరాబాద్‌లో ఉన్నట్లుగానే ధరలు ఉండగా.. చెన్నైలో మాత్రం మరింత తగ్గింది. చెన్నైలో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.6340 తగ్గింది. నిన్న రూ.1,62,560గా ఉండగా.. గురువారం రూ.1,56,220కి చేరుకుంది. అటు 22 క్యారెట్ల ధర రూ.1,43,200గా ఉంది. నిన్నటి పోలిస్తే రూ.5800 తగ్గిందని చెప్పవచ్చు.

4 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,570 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,700గా ఉంది. అటు వెండి ధరలు ఒకేసారి రూ.20 వేలు తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. నిన్న రూ.3.20 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే.

5 / 5
ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ సిల్వర్ ధర రూ.3 లక్షలుగా కొనసాగుతోంది. ఇవాళ ఏకంగా రూ.20 వేలు తగ్గింది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రాంతాలను బట్టి గోల్డ్ రేట్లల్లో మార్పులు ఉంటాయి. రాష్ట్రాలు విధించే ట్యాక్సులు, రవాణా ఖర్చులకు తగ్గట్లు ధరలు మారుతూ ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us