Sanjay Kasula |
Jul 11, 2023 | 1:59 PM
ముంబై యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు ముకేశ్ అంబానీ. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA పూర్తి చేశారు ముకేశ్ అంబానీ.
గౌతమ్ అదానీ కామర్స్ స్ట్రీమ్ నుంచి పట్టభద్రుడయ్యారు. అయితే చదువును మధ్యలోనే వదిలేసి ముంబైకి వచ్చి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు.
హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అమెరికన్ కాలేజీ నుంచి ప్రీ-యూనివర్శిటీ డిగ్రీని తీసుకున్నారు. శివ్ నాడార్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.
దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో సైరస్ పూనావాలా మూడో స్థానంలో నిలిచారు. ఆయన బృహన్ మహారాష్ట్ర కాలేజీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో జిందాల్ గ్రూప్ యజమాని సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో ఉన్నారు. అస్సాం నుంచి డిప్లొమా చేశారు.