EPFO: ఉద్యోగి మరణం తర్వాత.. PF డబ్బును నామినీలు ఎలా ఉపసంహరించుకోవాలి.. ఫుల్ డిటైల్స్..

|

May 31, 2023 | 1:36 PM

EPFO సభ్యులు పదవీ విరమణకు ముందు మరణించిన సందర్భంలో వారి PF ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి నామినీలను దాఖలు చేయడానికి సంస్థ అనుమతిస్తుంది.

1 / 5
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారుల సౌలభ్యం కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, EPFO సభ్యులు పదవీ విరమణకు ముందు మరణించిన సందర్భంలో వారి PF ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి నామినీలను దాఖలు చేయడానికి సంస్థ అనుమతిస్తుంది. EPF, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) కింద సేకరించబడిన నిధులను ఉపసంహరించుకోవడానికి నామినీ లేదా డిపెండెంట్‌లను E-నామినేషన్ అనుమతిస్తుంది.

2 / 5
ఈ-నామినేషన్‌ను ఎలా దాఖలు చేయాలంటే..  చందాదారు (క్లెయిమ్‌) నామినీ లేదా కుటుంబ సభ్యుడు అయినందున EPF సభ్యుని వివరాలతో ఫారం 20ని సమర్పించాలి. సభ్యుడు చివరిగా ఉద్యోగం చేసిన యజమాని ద్వారా దరఖాస్తును సమర్పించాలి.

3 / 5
ఈ దరఖాస్తును సమర్పించిన తర్వాత, క్లెయిమ్ ఫారమ్ ఆమోదం గురించిన SMS నోటిఫికేషన్‌లను హక్కుదారు స్వీకరిస్తారు. ఆ తర్వాత క్లెయిమ్‌దారు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఫారమ్ 20లో హక్కుదారు ఆధార్-లింక్ చేయబడిన సంప్రదింపు వివరాలను సమగ్రంగా అందించాల్సి ఉంటుంది.

4 / 5
నామినీ జతచేయవలసిన పత్రాలు..  చందాదారుడు/సభ్యుని మరణ ధృవీకరణ పత్రం, గార్డియన్షిప్ సర్టిఫికేట్, హక్కుదారు క్యాన్సిల్ చేసిన చెక్, ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ఫారం 5(IF),  పెన్షన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ఫారం 10D, ఉపసంహరణ ప్రయోజనం కోసం ఫారమ్ 10C, తదితర గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

5 / 5
EPFO ప్రకారం, హక్కుదారులు అధికారిక పోర్టల్ ద్వారా క్లెయిమ్‌ల స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు. దీనికోసం EPFO అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి.. సంబంధిత వివరాలను నమోదు చేసి తెలుసుకోవచ్చు.