Best CNG cars: సీఎన్‌జీ కారు కొనాలనుకుంటున్నారా..?మార్కెట్‌లో లభిస్తున్న బెస్ట్ కార్లు ఇవే..!

|

Oct 24, 2024 | 5:00 PM

కారు కొనుగోలు చేయాలని, కుటుంబ సభ్యులతోె కలిసి విహరించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే వాటి ధరలతో పాటు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ఖర్చులను చూసి భయపడుతుంటారు. కారును కొనుగోలు చేసినా దానిలో ఇంధనానికి ఖర్చు బాాగా ఎక్కువవుతుందని లెక్కలు వేసుకుంటారు. అయితే ఇలాంటి వారి కోసం సీఎన్ జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్లు మామూలు పెట్రోలు వాహనాల మాదిరిగానే మైలేజీ ఇస్తాయి. కానీ పెట్రోలుతో పోల్చితే సీఎన్ జీ ధర మూడు వంతులు తక్కువగా ఉంటుంది. అలాగే పర్యావరణహితంగా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.పది లక్షల లోపు ధరలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ సీఎన్ జీ కార్ల గురించి తెలుసుకుందాం.

1 / 5
మారుతీ సుజుకి ఆల్టో కె10 పిట్టకొంచెం కూతఘనం అన్నట్టు ఈ చిన్నకారు ఎంతో సమర్థంగా పనిచేస్తుంది. ఈ కారు సీఎన్ జీ వేరియంట్ అయిన ఎల్ఎక్స్ ఐ (ఓ) ధర రూ.5.73 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకూ ఉంటుంది. దీనిలోని 1.0 లీటర్ ఇంజిన్ నుంచి 56 హెచ్ పీ, 82.1 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ఇంజిన్ కు ఐదు స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేశారు. సుమారు 33.85 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

2 / 5
సీఎన్ జీ కారు కొరుకునేవారికి మారుతీ సుజుకి విడుదల చేసిన సెలెరియో మంచి చాయిస్. వీటిలో వీఎక్స్ఐ ట్రిమ్ లో  మాత్రమే బయో ఫ్యూయల్ ఎంపిక అందుబాటులో ఉంది.  ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్ తో పనిచేస్తుంది. సీఎన్ జీపై నడుస్తున్నప్పుడు 56 హెచ్ పీ, 82.1 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. ఐదు స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వచ్చిన సెలెరియా కారు రూ.6.73 లక్షలకు అందుబాటులో ఉంది. సీఎన్ జీ వెర్షన్ 34.43 మైలేజీ ఇస్తాయి.

3 / 5
సీఎన్ జీ వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి హ్యుందాయ్ ఎక్స్ టర్ బాగుంటుంది. సీఎన్ జీ ఎంపికలో ఈ కారు రెండు రకాల ట్రిమ్ లలో వచ్చింది. ఎక్స్ టర్ ఎస్ రూ.8.50 లక్షలు, నైట్ ఎడిషన్ ప్యాకేజీతో ఎక్స్ టర్ ఎస్ ఎక్స్ రూ.9.38 లక్షలుగా ఉన్నాయి.  ఈ కారు 1.2 లీటర్ బయో ఫ్యూయల్ ఇంజిన్ తో పనిచేస్తుంది.  67 హెచ్ పీ, 95.2 గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ జతచేశారు. సుమారు 27 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

4 / 5
టాటా పంచ్ సీఎన్ జీ కారు రూ.7.22 లక్షల నుంచి రూ.9.89 లక్షల ధరకు అందుబాటులో ఉంది. దీనిలోని 1.2 లీటర్ ఇంజిన్ నుంచి సీఎన్ జీపై నడుస్తున్నప్పుడు 72 హెచ్ పీ, 103 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతోంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కు ఇంజిన్ కు అమర్చారు. ఈ కారు సుమారు 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

5 / 5
టయోటా నుంచి విడుదలైన గ్లాంజా వినియోగదారులకు మంచి ఎంపిక. ఈ కారు రెండు ట్రిమ్ లలో బయో ఫ్యూయల్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది.  గ్లాంజా సీఎన్ జీ ఎస్ ట్రిమ్ రూ.8.65 లక్షలు, జీ ట్రిమ్ రూ.9.68 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతున్నాయి.  సీఎన్జీ 1.2 లీటర్ బయో ఫ్యూయల్ ఇంజిన్ తో నడుస్తుంది. దాని నుంచి 76 హెచ్ పీ, 98.5 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. గేర్ బాక్స్ కు ఐదు రకాల స్పీడ్ మాన్యువల్స్ తో అమర్చారు. ఈ కారు సుమారు 30.61 మైలేజీ అందిస్తుంది.