
సామాన్య ప్రజలకు మున్ముందు మరింత భారం కానుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది.

కిరాణ సరుకులు, బట్టలు, ఎలక్ట్రానిక్ ఇలా పలు రకాల వస్తువుల ధరలు పెరగనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు 8 నుంచి 10 శాతం పెరిగే అవకాశాలున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ ధరలు రాబోయే సంవత్సరంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ఈ ధరలు పెరిగేందుకు ఆస్కారం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ క్రమంలో రిఫ్రిజిరేట్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ధరలు కూడా 5 నుంచి 6 శాతం పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇలా ధర పెరుగుదలతో సామాన్యులపై మరింత ప్రభావం పడనుంది.