భారతదేశంలో హీరో కంపెనీ ప్రత్యేకతే వేరు. ఆ కంపెనీ నుంచి వచ్చిన ‘హీరో స్పెండర్ ప్లస్‘ మోడల్ బైక్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఆ బైక్‌లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 61,785 - 65,295 ఉంది.
రాజసం ఉట్టిపడేలా ఉండే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఇష్టపడిన వారుండరు. కానీ, ధర కాస్త ఎక్కువ కావడంతో సామాన్యులు దీనిని కొనలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ‘‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’’ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.67 - 1.92 లక్షలు గా ఉంది.
స్టైలిష్ లుక్‌తో రయ్ రయ్ మని పరుగులు తీసే యమహా కంపెనీ బైక్ ‘ఎంటీ-15 కి మాంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ‘యమహా ఎంటీ-15’ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.39 - 1.40 లక్షలుగా ఉంది.
యమహా వైజెడ్ఎఫ్ ఆర్15వీ3 బైక్ పట్ల యూత్ చాలా ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఈ బైక్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఈ బైక్ ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 1.47 - 1.51 లక్షల నుంచి మొదలవుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన మరో మోడల్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350’ ఇటీవలి కాలంలో ఈ మోడల్ బైక్‌లు దేశ వ్యాప్తంగా విపరీతంగా సేల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీటి ధర ఎక్స్ షోరూమ్‌లో 1.27 - 1.42 లక్షలు.
టీవీఎస్ అపాచీకి కూడా దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ లభిస్తోంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్‌లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ. 1.02 - 1.05 లక్షలు ఉంది.
స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్లపై కనిపించే బైక్‌లలో దాదాపు బజాజ్ పల్సర్ బైక్‌లే అధికంగా ఉంటాయి. పల్సర్ బైక్‌లకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. ప్రస్తుతం బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 1.33 లక్షలుగా ఉంది.
బజాజ్ పలర్స్ 150 కి కూడా విపరీతమై క్రేజ్ ఉంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 94,125 - 1.04 లక్షలుగా ఉంది. ఆన్‌రోడ్ ప్రైస్ వేరేలా ఉంటుంది.
దేశంలో టూవీలర్ బైక్‌లలో హోండా స్ల్పెండర్ తరువాత అత్యధికంగా అమ్ముడుపోయే టూవీలర్ గా హోండా యాక్టీవా నిలిచింది. హోండా యాక్టీవా ఎక్స్‌షోరూమ్ ధర రూ. 66,799 - 70,044 గా ఉంది.
దేశ వ్యాప్తంగా హోండా యాక్టీ తరువాత ఎక్కువగా అమ్ముడుపోయే టూవీలర్ ‘సుజుకీ యాక్సెస్ 125’. ఈ టూవీలర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 70,686 - 78,786 గా ఉంది.