Union Budget 2026: ముందుగానే బడ్జెట్ లీక్.. ఆర్ధికశాఖ మంత్రి హుటాహుటిన రాజీనామా.. ఎప్పుడంటే..?

Updated on: Jan 28, 2026 | 6:49 PM

మరో మూడు రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేవపెట్టేందుకు సిద్దమవుతోంది. దీంతో బడ్జెట్‌కి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన ఒక చేదు సంఘటన చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ పత్రులు ముందుగానే లీక్ అయ్యాయి. దీంతో ఏం జరిగిందంటే..

1 / 5
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్ అనేక ప్రాధాన్యతలను సంతరించుకుంది. ఆదివారం సెలవు రోజైనా బడ్జె్ట్ ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలమ్మ రికార్డ్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో బడ్జెట్‌కు సంబంధించి అనేక చారిత్రాత్మక విషయాలు బయటకొస్తున్నాయి.

2 / 5
బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి ప్రకటిస్తారు. అప్పుడే బడ్జెట్ పత్రులు, డాక్యుమెంట్స్ బయటకు విడుదల చేస్తారు. అప్పటివరకు అవి రహస్యంగానే ఉంటాయి. అయితే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందుగానే 1950లో బడ్జెట్ వివరాలు బయటకు లీక్ అయ్యాయి. అప్పట్లో ఆర్ధిక మంత్రిగా జాన్ ముథాయ్ ఉన్నారు.

3 / 5
బడ్జెట్ లీక్ కావడంతో నైతిక బాధ్యత వహిస్తూ జాన్ మథాయ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాత బడ్జెట్ పత్రులను ప్రింట్ చేసే స్థలాన్ని కూడా మార్చారు. 1950 వరకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రెస్‌లో బడ్జెట్ పత్రులను ప్రింట్ చేసేవారు. అప్పుడు లీక్ అవ్వడంతో ప్రింటింగ్ స్థలాన్ని మార్చారు.

4 / 5
రాష్ట్రపతి భవన్ నుంచి మింట్ రోడ్డులోని సురక్షిత ప్రదేశానికి మార్చారు. ఇక 1980లో ప్రభుత్వ ప్రెస్ ఉన్న మళ్లీ నార్త్ బ్లాక్‌కు మార్చారు. నార్త్ బ్లాక్‌లోని అండర్ గ్రౌండ్‌లో ప్రింటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడే ప్రింటింగ్ జరుగుతుంది. బడ్జెట్ తయారీలో అత్యంత కఠిన నియమాలు అమలు చేస్తారు.

5 / 5
బడ్జెట్ తయారీలో పాలు పంచుకునే అధికారులు, సిబ్బంది కొన్ని రోజుల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. కనీసం మొబైల్ ఫోన్లను కూడా వాడటానికి వీలు కాదు. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే వీళ్లు బయటకు వస్తారు. అప్పటివరకు లాన్ ఇన్ పీరియడ్‌లో ఉండాల్సిందే.