Best bikes: సేల్స్‌లో బడ్జెట్ బైక్స్ సరికొత్త రికార్డు.. ఆ కంపెనీదే మొదటి స్థానం

|

Oct 25, 2024 | 4:15 PM

దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ పలు కంపెనీల బైక్ లు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో 125 సీసీ బైక్ ల హవా నడుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ, స్లైలిష్ లుక్, ఇంధన సామర్థ్యం తదితర కారణాలతో వీటికి ఆదరణ లభిస్తోంది. హోండా, బజాజ్, టీవీఎస్, హీరో కంపెనీల మధ్య ప్రముఖంగా పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో జరిగిన అమ్మకాల ఆధారంగా ఏ బైకులు ఏ స్థానంలో నిలిచాయో తెలుసుకుందాం.

1 / 5
హీరో స్ల్పెండర్ బైక్ కు వినియోగదారుల ఆదరణ లభించింది. సెప్టెంబర్ లో 26,318 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. గతంలో పోల్చితే 3.16 శాతం పెరిగింది. హీరో స్ల్పెండర్ 125 సీసీ బైక్ ధర రూ.75,441 నుంచి రూ.78,286 వరకూ ఉంది.

2 / 5
హీరో ఎక్స్ ట్రీమ్ 125 బైక్ రూ.95 వేల నుంచి రూ.99,500 ధరలో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ లో 37,520 ఎక్స్ ట్రీమ్ బైక్ యూనిట్లను కంపెనీ విక్రయించింది. అమ్మకాలలో  హీరో ఎక్స్ ట్రీమ్ 125 బైక్ నాలుగో స్థానంలో నిలిచింది.

3 / 5
హోండా కంపెనీ నుంచి విడుదలైన ఎస్పీ 125/ షైన్ 125 సీసీ మోటారు సైకిళ్లు సెప్టెంబర్ లో జరిగిన అమ్మకాలలో అగ్రస్థానంలో నిలిచాయి. హోండా ఎస్పీ, షైన్ మోాటారు సైకిళ్ల యూనిట్లను ఆ కంపెనీ 1,53,476 విక్రయించింది. గతేడాదిలో పోల్చితే దాదాపు 13.40 శాతం ఎక్కువ. హోండా షైన్ రూ.81,251 నుంచి రూ.85,251 ధరకు, హోండ్ ఎస్పీ రూ.87,468 నుంచి రూ.91,468 ధరకు అందుబాటులో ఉన్నాయి.

4 / 5
అమ్మకాలలో రెండో స్థానంలో బజాజ్ కంపెనీ బైక్ లు నిలిచాయి.  పల్సర్ 125/ ఎన్ఎస్ 125 బైక్ ల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆ కంపెనీ సెప్టెంబర్ నెలలో 67,256 యూనిట్లను విక్రయించింది. బజాజ్ పల్సర్ 125 రూ.92,883, ఎన్ ఎస్ 125 బైక్ రూ.1.01 లక్షలకు అందుబాటులో ఉంది. పైవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు

5 / 5
టీవీఎస్ నుంచి విడుదలైన రైడర్ బైక్ అమ్మకాలలో మూడో స్థానం సాధించింది. టీవీఎస్ రైడర్ కు చెందిన 43,274 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. ఈ మోటారు సైకిల్ రూ.84,869 నుంచి రూ.1.04 లక్షల ధరలో అందుబాటులో ఉంది. అయితే గతేడాది 48,753 రైడర్ బైక్ అమ్ముడయ్యాయి. వాటితో పోల్చితే ఈ సారి తగ్గుముఖం పట్టినట్టే.