Aadhaar Card: అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ ఎలా తీసుకోవాలి..? ఈ డాక్యుమెంట్స్ ఉంటే సెకన్లలోనే జారీ.. పూర్తి ప్రాసెస్ ఇదే..

Updated on: Jul 25, 2026 | 1:10 PM

అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. అయితే ఈ కార్డు ప్రత్యేకంగా ఉంటుంది. దీనినే బాల ఆధార్ అని పిలుస్తారు. ఇది నీలి రంగులో ఉంటుంది. అయితే ఇది పొందటం చాలా సులువు. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం ద్వారా పొందవచ్చు.

1 / 5
అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ అనేది తప్పనిసరి. ఇది లేకపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందలేరు. ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులు ఎలాంటివి అందుకోలేరు. దీంతో ప్రతీఒక్కరికీ ఆధార్ అనేది అవసరం. అయితే పిల్లల కోసం బాల ఆధార్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది. కేవలం 5 సంవత్సరాల్లోపు పిల్లలకు దీనిని జారీ చేస్తారు. ఇది ఎలా పొందాలంటే..?

2 / 5
బాల ఆధార్ అనేది నీలి రంగులో ఉంటుంది. పిల్లలకు ప్రత్యేకంగా జారీ చేసే ఆధార్ కార్డు ఇది. పిల్లలను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. స్కూల్స్, పాస్ పోర్ట్ దరఖాస్తులు, ప్రభుత్వ స్కీమ్స్, ఇతర సేవలను పొందటంలో సహాయపడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ కార్డును తీసుకోవడం వల్ల వారికి ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. పిల్లలు పుట్టగానే దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

3 / 5
బాల ఆధార్‌కు ఐరిస్, వేలిముద్రలు లాంటి బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. పిల్లలకు దీనిని తీసుకోవాలంటే తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఒకరిది ఆధార్ సమర్పించాలి. ఎందుకంటే పిల్లల ఆధార్‌ను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. దీనిని తీసుకోవాలంటే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు పూర్తి చేయాలి.

4 / 5
ఆధార్ నమోదు సమయంలో పిల్లలను ఫొటో తీస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల్లో ఒకరిది ఆధార్ కార్డ్ సమర్పిస్తే సరిపోతుంది. పిల్లలను కూడా ఆధార్ సేవా కేంద్రానికి తీసుకెళ్లాలి. ఇంతకంటే ముందు తల్లిదండ్రులు ముందుగానే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని వెళ్లవచ్చు. ఆ సమాయానికి మాత్రమే వెళ్లడం ద్వారా సమయం ఆదా అవుతుంది.

5 / 5
కేవలం పిల్లల ఫొటోను మాత్రమే తీసుకుంటారు. ఐదేళ్ల దాటాక పిల్లల బయోమెట్రిక్స్‌ను అప్డేట్ చేస్తారు. ఐదేళ్లు దాటాక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్స్ అప్డే్ట్ చేసుకోవాలి.

Follow Us