AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి.. డబ్బు ఆదా..!

Second Hand Car: ఆన్‌లైన్ విధానం కారణంగా కార్ల కొనుగోలు, అమ్మకం రెండూ చాలా సులభతరం అయ్యాయి. అయితే ఇది మోసాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాంటి సందర్భంలో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతారు. నమ్మదగిన ప్రదేశం నుండి మాత్రమే కారు కొనండి..

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి.. డబ్బు ఆదా..!
Subhash Goud
|

Updated on: May 11, 2025 | 8:22 PM

Share

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా పొదుపుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, ఉపయోగించిన కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రజల మనస్సులలో అనేక భయాలు ఉంటాయి. ఉదాహరణకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి రావడం లేదా చట్టపరమైన చర్యల భయం వంటివి. సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఆ 5 విషయాల గురించి తెలుసుకుందాం.

  1. మీరు సెకండ్ హ్యాండ్ కారు కొన్నప్పుడల్లా తొందరపడి ఏ కాగితాన్ని విస్మరించకండి. కారు గుర్తించి అన్ని వివరాలు తెలుసుకోండి. కారు ఎప్పుడూ ఎటువంటి చట్టపరమైన సమస్యలలో చిక్కుకోలేదని నిర్ధారించుకోండి. బీమాను మీ పేరుకు బదిలీ చేయించుకోండి. కారుకు ఎటువంటి చెల్లింపులు లేవని నిర్ధారించుకోండి.
  2. చాలా సార్లు టెస్ట్ డ్రైవ్ సమయంలో కారు మంచి స్థితిలో ఉన్నప్పటికీ తరువాత సరిగ్గా నడపలేరు. అటువంటి పరిస్థితిలో కారు నిపుణుడిని సంప్రదించి ఇంజిన్, బ్రేక్‌లు, పెట్రోల్ ట్యాంక్, టైర్లను తనిఖీ చేయండి.
  3. ప్రజలు తమ కారును అమ్మడానికి తరచుగా ఓడోమీటర్‌ను ట్యాంపర్ చేస్తారు. కొంత సమయం తర్వాత కారు మంచి మైలేజీని ఇవ్వడం లేదని మీరు గ్రహిస్తారు. విక్రేతలు తరచుగా ఇలాంఇవి దాచి పెడతారు. అందుకే సర్వీస్ సెంటర్‌లో మైలేజీని తనిఖీ చేసుకోండి.
  4. సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఆన్‌లైన్ మార్కెట్‌లో కూడా మంచి డీల్స్ కోసం చూడండి. తరచుగా ఉత్సాహంలో ప్రజలు ఎక్కువ డబ్బు చెల్లించి తరువాత పశ్చాత్తాపపడతారు. అందుకే ఆన్‌లైన్ మార్కెట్‌ను కూడా తనిఖీ చేయాలి.
  5. ఆన్‌లైన్ విధానం కారణంగా కార్ల కొనుగోలు, అమ్మకం రెండూ చాలా సులభతరం అయ్యాయి. అయితే ఇది మోసాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాంటి సందర్భంలో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతారు. నమ్మదగిన ప్రదేశం నుండి మాత్రమే కారు కొనండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి