
ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త జెన్-3 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని శుక్రవారం ప్రారంభించింది. 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఎంట్రీ లెవెల్ ఎస్1 ఎక్స్ స్కూటర్ రూ.79,999కు అందుబాటులో ఉంది. 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో టాప్-టైర్ ఎస్1 ప్రో+ రూ.1,69,999కు అందుబాటులో ఉంది. ఓలా తాజా ఈవీ ఆపరేటింగ్ సిస్టమ్, 'మూవ్ ఓఎస్-5' ఆధారంగా ఈ స్కూటర్లను రూపొందించారు.

ఓలా జెన్-3 స్కూటర్లు మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ ఆధారంగా పని చేస్తాయి. ముఖ్యంగా గత మోడల్స్‌లో వాటిన హబ్ మోటర్స్‌ను భర్తీ చేసేలా వీటిని జెన్-3 స్కూటర్స్‌లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జెన్-3 స్కూటర్ మోటర్ డిజైన్ ఐదు రెట్లు ఎక్కువ సమర్థవంతమైనదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఓలా జెన్-3 స్కూటర్‌లు చైన్ డ్రైవ్‌తో పాటు ప్రీ-లూబ్రికేటెడ్ ఓ-రింగ్‌లతో వస్తుంది. గత మోడళ్లలో ఉపయోగించిన బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కాలం పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఓలా పేటెంట్ పొందిన 'బ్రేక్ బై వైర్' సాంకేతికత జెన్-3 లైనప్‌కు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సిస్టమ్ మోటారు నిరోధకతను సమతుల్యం చేయడానికి బ్రేక్ లివర్‌పై సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. అందువల్ల బ్రేక్ ప్యాడ్ జీవితకాలం రెట్టింపు అవుతుంది.

ఎంట్రీ-లెవల్ ఓలా ఎస్1 ఎక్స్ 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ లేదా 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ఎస్1 ఎక్స్+ ప్రత్యేకంగా 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఎస్1 ప్రో+ మోడల్ 320 కిమీ పరిధిని, గరిష్ట వేగం 141 కిలోమీటర్లు ఉంటుంది.