Aadhar Verification: యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రజలకు ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం కోసం డిజిటల్ సంతకం చేసిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు, పేరు, చిరునామా, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డుదారుని ఫోటో వంటివి ఉంటాయి. ఈ మేరకు కేందర్ ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది.
'ది ఆధార్ నిబంధనలు-2021'ని ప్రభుత్వం ఈ నవంబర్ 8న జారీ చేయగా, దీనిని మంగళవారం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో ఆధార్ ఆఫ్‌లైన్‌కు సంబంధించిన పరిశీలనకు పూర్తి వివరాలు పేర్కొన్నారు. ఆధార్ కార్డుదారుడి డిజిటల్ సంతకంతో కూడిన పత్రాన్ని ఈ-కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ కోసం ఆధార్ ఆఫ్‌లైన్ ధృవీకరణను కోసం ఎంపిక చేసుకోవచ్చు.
ఈ ఆఫ్‌లైన్ ప్రక్రియలో భాగంగా ఓటీపీ, ఆన్‌లైన్ బయోమెట్రిక్ ధృవీకరణ, క్యూఆర్ కోడ్ ధృవీకరణ తదితర వివరాలు కొనసాగుతాయి. అయితే కేంద్ర డేటాబేస్‌లో కస్టమర్ నుంచి స్వీకరించబడిన ఆధార్ నంబర్ జనాభా సమాచారంతో హోల్డర్ యొక్క ఆధార్ నంబర్ సరిపోలుతుంది.
సంబంధిత సంస్థలు వీటిలో ఏదో ఒకదానిని లేదా మరింత భద్రత నిమిత్తం ఒకటి కంటే ఎక్కువ విధానాలను ఉపయోగించి ఆధార్ సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. ఆధార్ వినియోగదారుడు ఈకేవైసీ సమ్మతి ఉపసంహరణ అధికారం వినియోగదారులకే ఇచ్చింది.