
బంగారం ధరలు గత రెండేళ్ల కాలంలో భారీగా పెరిగాయి. గతంలో తులం బంగారం రూ.70 వేలుగా ఉండగా.. గత రెండేళ్లుగా భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం రూ.1.44 లక్షల దగ్గర ట్రేడవుతున్నాయి. అయితే బంగారంలో ప్రధానంగా రెండు రకాలు బాగా పాపులర్ అయ్యాయి. అందులో ఒకటి 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ కాగా.. మరొకటి 22 క్యారెట్లు. ఎక్కువమంది ఈ రెండు క్యారెట్ల గోల్డ్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు.

అయితే 24 క్యారెట్ల బంగారం ధర ఎక్కువగా ఉంటే.. 22 క్యారెట్ల ధర కాస్త తక్కువగా ఉంటుంది. రెండు బంగారమే అయినప్పటికీ.. ధరల్లో ఎందుకు తేడా ఉంటుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటి మధ్య ప్రధాన తేడా వాటి స్వచ్చతే. వాటి క్వాలిటీని బట్టి ధరలను నిర్ణయిస్తారు.

24 క్యారెట్ల బంగారం పూర్తి స్వచ్చతతో ఉంటుంది. ఇది చాలా మృదువుగా ఉంటుంది. దీంతో ఆభరణాలు తయారుచేయడం సాధ్యం కాదు. అయితే ఆభరణాలు తయారుచేసేందుకు ఇతర లోహాలను కలపాల్సి ఉంటుంది. ఇందుకోసం రాగి, వెండి లాంటివి కలుపుతారు. ఈ విధంగా 22 క్యారెట్ల బంగారం తయారుచేస్తారు. ఇతల లోహాలు కలపడం వల్ల దీని స్వచ్చత 91.6 శాతంగా ఉంటుంది. ఇందులో 8.4 శాతం రాగి లేదా వెండి ఉంటుంది.

ఆభరణాలను మరింత ధృఢంగా తయారుచేసేందుకు ఇతర లోహాలను కలపాల్సి ఉంటుంది. ఇతర లోహాలను కలవడం వల్ల 22 క్యారెట్ల బంగారం ధర తక్కువగా ఉంటుంది. అయితే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలపడం వల్ల బిల్లు పెరుగుతుంది. అయితే మీరు కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టాలనుకుంటే 24 క్యారెట్ల గోల్డ్ ఎంచుకోండి. దీని వల్ ఎలాంటి తయారీ ఖర్చు ఉండడు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,220 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,200గా కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,160గా ఉంది. ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.