
తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో గోవా వెళ్లి హాయిగా గడుపుతుంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ, ఆర్టీసీ అనేక ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తుంది. తక్కువ ధరకే అన్నీ ప్రదేశాలను సందర్శించేలా ఈ స్పెషల్ ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నాయి. జర్నీ, వసతి, ఆహారం గురించి ఎలాంటి ఇబ్బందులు పడుకుండా సౌకర్యవంతంగా వెళ్లి రావొచ్చు. తాజాగా గోవా వెళ్లాలనుకునేవారి కోసం టీఎస్‌ఆర్టీసీ అద్భుతమై ప్యాజీని తీసుకొచ్చింది

టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ గోవా టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ టూర్‌తో గోవాతో పాటు కుక్కి, ఉడిపి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు ఈ టూర్ ప్రారంభవుతుంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు మొదలవుతుంది. 26న కుక్కి సుబ్రహ్మణ్యాస్వామి దర్శనం కల్పించనుండగా.. 27న ఉడుపి, మురుదేశ్వర్ ప్రాంతాల సందర్శన ఉంటుంది

ఇక ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు రెండు రోజుల పాటు గోవా సందర్శన ఉంటుంది. ఈ రెండ్రోజుల్లో గోవాలోని బీచ్‌లతో పాటు ఇతర ప్రముఖ ప్రదేశాల సందర్శన ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర కేవలం రూ.5130 మాత్రమే. ఇందులో పాల్గొనాలనుకునేవారు టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

గోవా టూర్ ప్యాకేజీలకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆసక్తిగల వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9391072283 లేదా 9063401072 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు.

ఒక్కొక్కరికీ టికెట్ ఛార్జీ రూ.5130 ఉంటుంది. చిన్నపిల్లలకు తక్కువగా ఛార్జ్ చేస్తారు. కేవలం గోవానే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఈ టూర్ ద్వారా చూడవచ్చు. దీంతో ఇది ఒక అద్బుతమైన ప్యాకేజ్‌గా చెప్పవచ్చు. కాగా టీఎస్‌ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది.