
గ్రీన్ టీని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అందులో ఉండే క్యాటెచిన్స్ , యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. గ్రీన్ టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరిచేందుకు కావాల్సిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్ ,నేరేడు పండ్లు, బెర్రీలు వంటి వాటిని తినే ఆహారంలో చేర్చుకోవడం మంచింది. తీసుకోవడం మంచిది.

శరీర వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సాల్మన్, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తినే ఆహారంలో చేర్చుకోండి.

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, సీజనల్ వ్యాధి నుంచి ఉపశమనం కోసం తినే ఆహారంలో పసుపును జోడించండి. ఇలా పసుపు తినే ఆహారంలో చేర్చడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కోసం బచ్చలికూర, పాల కూర, తోటకూర వంటి ఆకు కూరలను పుష్కలంగా తినండి.

బ్రోకలీ,యు బ్రస్సెల్స్ మొలకలు వంటి కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పెరిగి వర్షాకాలంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

నారింజ, నిమ్మ , ఉసిరి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.