
బార్లీ తీసుకోవడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బార్లీ అనేది అనేక పోషకాలను కలిగి ఉన్న ధాన్యం. బార్లీని తరచుగా తీసుకోకపోయినా, ఎండాకాలంలో బార్లీ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బార్లీలో ఇనుము, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, నియాసిన్, విటమిన్లు, సోడియం, పొటాషియం, మాంగనీస్, ప్రోటీన్, శక్తి, రాగి, జింక్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. దీనిని గరిబోళ్ల సంజీవని.. లేదా.. పానీయంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో కూడిన, అత్యంత పోషకమైన ఆరోగ్య పానీయం. ఇది శరీరానికి చలువ చేయడంతోపాటు.. పలు అనారోగ్య సమస్యలకు నివారణిగా పనిచేస్తుంది.

బార్లీ నీరు తాగడం వల్ల శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది రుచికరంగా కూడా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.

బార్లీ నీరు తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మీకు కూడా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే, మీరు ఈ ఆరోగ్యకరమైన నీటిని క్రమం తప్పకుండా తాగవచ్చు.

మహిళలు తరచుగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. బార్లీ నీరు తాగడం వల్ల UTIలు మరియు ఇతర మూత్ర సమస్యలను నివారించవచ్చు.

ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరమైన పానీయం. బార్లీ నీరు తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు నివారిస్తుంది. ఇంకా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

బార్లీ నీటిని ఎలా తయారు చేయాలి: కొంచెం బార్లీని లేదా మూడు నాలుగు స్పూన్ల బార్లీ పొడిని తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసి దానిలో నీళ్లు పోసి.. 7-8 నిమిషాలు ఉడకబెట్టండి. మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి.. అనంతరం ఒక కప్పులోకి వడకట్టి, నిమ్మరసం వేసుకుని తాగండి.. ఇంకా.. వేడిగా ఉన్నప్పుడు కూడా డీటాక్స్ నీటిని టీ లాగా నెమ్మదిగా తాగవచ్చు.