
బొమ్మిడాయిల పులుసుకు కావాల్సిన పదార్థాలు: అర కిలో బొమ్మిడాయిల చేపలు, 2 ఉల్లిపాయలు , రెండు టమాటాలు, కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, నాలుగు కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి, రుచికి సరిపడా ఉప్పు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం: ముందుగా చేపలను రెడీ చేసుకోవాలి: ముందుగా బొమ్మిడాయిల చేపలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసి బాగా కడగాలి. ఆ తరవాత దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు రాసి 5 నిమిషాలు పక్కన పెట్టి దీనిని మళ్ళీ ఇంకోసారి కడగాలి. ఇలా చేస్తే నీచు వాసన మొత్తం పోతోంది.

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేయాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా దీనిలో టమాటాలు కూడా వేసి మెత్తబడే వీటిని ఉడికించాలి.

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 3 : ఆ తరువాత దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసి దీనిని బాగా కలపాలి. అలాగే, దీనిలో చింతపండు రసం కూడా పోసి తగినంత నీరు, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించాలి.

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 4 : ఇక ఇప్పుడు దీనిలో చేపలను వేసుకుని కొద్దీ సేపు కదలకుండా ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువగా పాత్రను మెల్లగా కదిలించాలి. మూతపెట్టి 15 నిమిషాల పాటు మంచిగా ఉడికించాలి. చివర్లో మెంతుల పొడి, కొత్తిమీర కూడా చల్లి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకోవడమే.