
ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో తన ప్రతి కదలికలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే తాజాగా ఈ అందాల తార షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

'ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ప్రెట్టీ' అంటూ గర్భం కారణంగా తన కాళ్లు ఎలా వాచిపోయాయో ఇందులో వివరించింది. ఈ పోస్ట్‌కు కొన్నిసార్లు అమ్మ ప్రయాణమేమీ అంత ఉందంగా ఉండదు అని క్యాప్షన్ ఇచ్చింది.

కాగా గర్భిణీలకు ఇలాంటి సమస్యలు సర్వసాధారణమని నిపుణులు చెబుతుంటారు. ఏమయినా సోషల్ మీడియాలో సోనమ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.

సోనమ్, ఆనంద్ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే వీరు ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.

ఇటీవల లండన్‌లో ఘనంగా సీమంతం జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మెటర్నిటీ ఫొటో షూట్‌లోనూ ఎంతో అందంగా మెరిసింది.