చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..చేదుగా ఉన్నా ప్రాణం పోస్తుంది

Updated on: Jul 07, 2026 | 10:40 PM

బోడ కాకరకాయ, దీనిని ఆకాకరకాయ, అడవి కాకరకాయ, బొంత కాకరకాయ లేదా ముళ్ళ కాకరకాయ అని కూడా అంటారు. ఇది వర్షాకాలంలో, ముఖ్యంగా శ్రావణ మాసంలో మాత్రమే లభించే ఒక ప్రత్యేకమైన కూరగాయ. ఈ సీజనల్ వెజిటబుల్‌తో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కథనంలో, శ్రావణిస్ కిచెన్ నుండి రుచికరమైన బోడ కాకరకాయ పులుసు (గ్రేవీ కర్రీ) తయారీ విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ కూర అన్నంతో పాటు చపాతీ, రోటీ వంటి వాటిలోకి కూడా అద్భుతంగా ఉంటుంది.

1 / 5
కావాల్సిన పదార్థాలు : బోడ కాకరకాయలు: 250 గ్రాములు, చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు,   మెంతులు,  జీలకర్ర, నువ్వులు,  నూనె,  పచ్చిశనగపప్పు,  మినప్పప్పు,  ఆవాలు,ఇంగువ, కరివేపాకు,   పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,వెల్లుల్లి ముద్ద,   పసుపు,   కారం,   ఉప్పు,   ధనియాల పొడి,   దాల్చిన చెక్క,   యాలకులు,   కొత్తిమీర

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును శుభ్రంగా కడిగి, పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది పులుసు కోసం సిద్ధంగా ఉంటుంది.  స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులోకి పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, మూడు టీ స్పూన్ల నువ్వులు  తీసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ వేయించిన పదార్థాలను ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి మరోసారి వేయించాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. అవి దోరగా వేగిన తర్వాత, కచ్చాపచ్చాగా దంచిన ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద వేసి మరో నిమిషం పాటు వేయించాలి.

4 / 5
ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి, ముందుగా కట్ చేసుకున్న బోడ కాకరకాయ ముక్కలను వేయాలి. ఇలా నూనెలో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయడం వలన కూరకి మంచి రుచి వస్తుంది. మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కారం వేసి రెండు నిమిషాల తర్వాత చింత పండు పులుసు వేసుకోవాలి.

5 / 5
ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఉడికి రసం చిక్కబడుతుంది. అదే సమయంలో కాకరకాయలు ఉడికేలోపు, ముందుగా వేయించుకున్న నువ్వులు, మెంతులను మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి.  మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, మెంతి పొడి అన్నీ వేసుకోవాలి. పులుసు బాగా మరగబెట్టుకోవాలి. పులుసు చిక్కబడిన తర్వాత అందులో కొత్తిమీర వేయాలి. అంతే అడవి కాకర పులుసు రెడీ.

Follow Us