
బిగ్బాస్ షో ముందు వరకు రతిక రోజ్ పేరు అసలు ఎవరికీ తెలియదు. కానీ ఈ షోతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సెషన్ అయ్యింది. బిగ్బాస్ రియాల్టీ షోలో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.

పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్తో స్నేహం.. బిగ్బాస్ ను పెద్దయ్య అంటూ పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

తొలి మూడు వారాల వరకు అందరి ఫోకస్ ఈ అమ్మాడి పైనే ఉండేది. లవ్, బ్రేకప్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడేది. ఆ తర్వాత తన స్ట్రాటజీస్ బెడిసికొట్టాయి.

దీంతో నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. కానీ ఉల్టా పుల్టా సీజన్ కావడంతో మరోసారి హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత ఆట ఆడలేకపోయింది.

ఇక తాజాగా సోషల్ మీడియాలో రతిక షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. వైట్ షర్ట్, ప్రింటెడ్ నిక్కర్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఎదుటి వారి ప్రవర్తన మీ ఆత్మశాంతిని నాశనం చేయనివ్వకండి అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది రతిక.