Nail Polish: అందం కోసం రంగురంగుల నెయిల్ పాలిష్‌లు వాడుతున్నారా.. స్కిన్ క్యాన్సర్‌ను కొనుక్కున్నట్లే అంటూ ఆందోళన..

Updated on: May 19, 2023 | 1:26 PM

నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్. పొడవైన గోళ్లు, వాటిపై రంగురంగుల నెయిల్ పాలిష్ డిజైన్లు యువత మెచ్చే ఫ్యాషన్ గా మారింది. కానీ నెయిల్ పాలిష్ లో వాడే కొన్ని రకాల రసాయనాల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గోర్లకు చేసే జెల్‌ మెనిక్యూర్‌ కోసం వినియోగించే అల్ట్రావయలెట్‌ డ్రయర్ల వల్ల క్యాన్సర్‌ ముప్పు ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

1 / 7
నెయిల్ పాలిష్.. అమ్మాయిల గోర్లకి మరింత అందాన్నిచ్చే ఓ కాస్మొటిక్ ప్రొడక్ట్. వీటిని అమ్మాయిలో ఎప్పుడో ఓన్ చేసేసుకున్నారు. వారానికోసారి పాతది తీసేయడం.. కొత్తరంగుని వేయడం.. మరి ఇంకా ఎక్కువ మాట్లాడితే.. రోజుకో రంగు కూడా వేసేస్తామంటూ చూడచక్కని కలర్స్ పేయింట్స్‌ని తమ పొడవాటి నెయిల్స్‌పై వేసుకుంటుంటారు. అయితే.. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

2 / 7
గోర్లకు చేసే జెల్‌ మెనిక్యూర్‌ కోసం వినియోగించే అల్ట్రావయలెట్‌ డ్రయర్ల వల్ల క్యాన్సర్‌ ముప్పు ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యూవీ డ్రయర్లపైన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా చేసిన అధ్యయనం వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 20 నిమిషాల సెషన్‌లో యూవీ లైట్‌ కింద ఉన్న శరీర కణాల్లో 20 నుంచి 30 శాతం కణాలు చనిపోతాయని, మూడు 20 నిమిషాల సెషన్లలో 65 శాతం నుంచి 70 శాతం కణాలు చనిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

3 / 7
దాదాపు మార్కెట్లో దొరికే 3వేల రకాల నెయిల్ పాలిష్‌‌లపై జరిగిన పరిశోధనల్లో 49శాతం నెయిల్‌పాలిష్‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. ఇలాంటి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని పెట్టుకున్న 10-14గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

4 / 7
మిగతా కణాలు కూడా రోగ నిరోధకతను కోల్పోవడంతో పాటు డీఎన్‌ఏ ధ్వంసమవుతుందని, ఇది స్కిన్‌ క్యాన్సర్‌కు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘యూవీ నెయిల్‌ పాలిష్‌ డ్రయర్ల వల్ల కణాల డీఎన్‌ఏ డ్యామేజ్‌ అవుతుంది. డ్యామేజ్‌ అయిన డీఎన్‌ఏ చాలాకాలం పాటు మళ్లీ బాగుకావడం లేదు. స్కిన్‌ క్యాన్సర్‌ బాధితుల కణాల్లో ఉండే మ్యుటేషన్లే యూవీ డ్రయర్లు ఉపయోగించిన వారిలో కనిపిస్తున్నాయి. యూవీ డ్రయర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్త లుడ్‌మిల్‌ అలెజ్గాన్‌డ్రోవ్‌ తెలిపారు.

5 / 7
 నెయిల్ పాలిష్‌లలో మెథాక్రిలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మంలోకి ప్రవేశించి చెడు ఎలర్జీలకు కారణం అవుతాయి. వీటివల్ల గోళ్లు పెళుసుగా మారి, విరిగిపోతాయి. దీర్ఘకాలంగా నొప్పి ఉంటుంది. నెయిల్ పాలిష్‌లలో ఈ రసాయనాన్ని వాడతారు. కాబట్టి వాటిని గోళ్లకు వేసుకోకపోవడమే మంచిది. ఆ రసాయనం లేని నెయిల్ పాలిష్‌లు ఏదో తెలుసుకోవడం కూడా కష్టమే. కాబట్టి నెయిల్ పాలిష్ వేసుకున్నాక ఏమాత్రం రియాక్షన్ కనిపించినా.. వాటిని దూరం పెట్టేయాల్సిందే. లేకుంటే అది చేతి వేళ్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. నెయిల్ పాలిష్ వేసుకునే ముందు గోళ్లకు SPF30 అనే సన్‌స్క్రీన్ లోషన్ రాసి ఆ తరువాత నెయిల్ పాలిష్ వేసుకోవడం ఉత్తమమంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.

6 / 7
నెయిల్ పాలిష్‌లలో ట్రైఫెనెల్ ఫాస్పేట్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది శరీరంలో చేరితే నేరుగా హార్మోన్లపైనే ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడో ఒకసారి నెయిల్ పాలిస్ వేసుకుంటే ఫర్వాలేదు కానీ, నిత్యం వేసుకునే వారికి మాత్రం హానికర ప్రభావాలు పడే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. నెయిల్ పాలిస్ వేసుకున్న చేత్తోనే అన్నం తింటే ఆ రసాయనాలు పొట్టలోకి చేరే అవకాశం కూడా ఉంది. కాబట్టి కుడి చేతికి నెయిల్ పాలిష్ వేసుకోకపోవడమే మంచిది.

7 / 7

చర్మానికి అంటుకోకుండా గోళ్లరంగు వేసుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు.. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ నెయిల్స్‌కి పెట్టుకుని అతికించుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుండవు.. ఏదేమైనా నెయి‌ల్ పాలిష్ అధికంగా వాడితే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. సో.. నెయిల్ పాలిష్‌ ప్రియులారా బీకేర్ ఫుల్..!