మామల్లపురం అని కూడా పిలువబడే మహాబలిపురం చెన్నై నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పురాతన చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పాలతో నిండిన పురాతన పట్టణం. 7వ శతాబ్దపు పల్లవ రాజవంశం కాలంలో నిర్మించిన చారిత్రాత్మక దేవాలయాలు, ఏకశిలా విగ్రహాలు, పురాతన కళాఖండాల మ్యూజియం చాలా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఇక్కడ తీర్ ఆలయం, పంచ రథ, వరాహ, మహిషాసురమర్దిని, కృష్ణ గుహ దేవాలయాలు చూడదగ్గ ప్రదేశాలు.