ఇంట్లో బల్లులు ఎక్కువైపోతున్నాయా.. ఇలా తరిమికొట్టండి మరి!

Updated on: Sep 15, 2025 | 7:05 PM

ప్రస్తుతం వంటిట్లో చాలా మందిని బాధపెట్టే సమస్యల్లో బల్లుల సమస్య ఒకటి. ఇంట్లో బల్లులు ఎక్కవగా ఉంటే కలిగే చికాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇంట్లో ఎక్కువగా ఉన్న బల్లులను ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
బల్లులు కొందరికి చికాకును కలిగిస్తే, మరికొందరికి భయాన్ని కలిగిస్తాయి. అందుకే ఇంట్లో బల్లులు ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బల్లలు అనేవి ఇంట్లో పెరిగిపోతుంటాయి. అయితే వాటిని ఇంటి నుంచి పంపించాలంటే, తప్పకుండా కొన్ని  టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
బల్లులకు నచ్చని స్మెల్ అంటే అది వెల్లుల్లి, ఉల్లిపాయల వాసన. వీటి వాసనను బల్లలు అస్సలే ఇష్టపడవంట. అయితే మీ వంటింట్లో బల్లులు ఎక్కువగా ఉంటే వంటగది అల్మారాలు, బాత్ రూమ్స్, కిటికీలు లేదా తలుపుల వద్దద వెల్లుల్లిపాయలలను నీటిలో కలిపి స్ప్రే చేస్తే అవి అక్కడి నుంచి వెళ్లిపోతాయంట. అలా పదే పదే చేయడం వలన ఇంటిలోకి బల్లులు రావు అంటున్నారు నిపుణులు.

3 / 5
గుడ్డు పెంకుల వాసన కూడా బల్లులు ఇష్టపడవంట. అయితే మీ ఇంట్లో గనుక బల్లులు ఎక్కువగా ఉన్నాయని మీకు అనిపిస్తే వెంటనే, వెంటనే గుడ్డు పెంకులను మెత్తటి పొడిలా చేసి, ఇంటిలోపల బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వేయాలి. దీంతో బల్లులు ఆ ప్రదేశాలకు రావు. ఇది బల్లులు రాకుండా మాత్రమే కాకుండా, మొక్కలు వేపుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే క్రమం తప్పకుండా బల్లుల నివాసం ఉండే ప్రదేశంలో ఈ పొడిని చల్లడం వలన అవి రాకుండా ఉంటాయంట.

4 / 5
పొగాకు, కాఫీ పౌడర్‌తో కూడా బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టవచ్చునంట. అయితే దీని కోసం ముందుగా పొగాకును , కాఫీ పొడిని ఒక బౌల్‌లో తీసుకొని దానిని చిన్నగా ముద్దల్లా చేసుకోవాలి. తర్వాత వాటిని బల్లలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెట్టడం వలన ఆ ఘాటు వాసనకు బల్లలు ఇంటి నుంచి పారిపోతాయంట.

5 / 5
అదే విధంగా నల్ల మిరియాల వాసన కూడా బల్లులు ఇష్టపడవంట. అందువలన నల్ల మిరియాల పౌడర్‌ను ఒక బాటిల్‌లో వేసి అందులో కొన్ని నీరు పోసి, ఆ వాటర్ బల్లలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయడం వలన బల్లులు ఇంటి నంచి పారిపోతాయంట. (నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్  ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు.)