
శుభకార్యాలు, పండగలు, ఫంక్షన్లకు అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా అందమైన ముఖం కోరుకుంటే ఈ కింది ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని అప్లై చేసుకోండి. చందమామలా మెరిసిపోతారు.

ఒక గిన్నెలో కొన్ని ద్రాక్షలు వేసి, అవి మెత్తగా అయ్యే వరకు నలిపి ఆ తర్వాత అందులో బాదం పొడి, కుంకుమపువ్వు, పాలు, తేనె వేసి పేస్ట్‌లా కలపాలి.

ఆ తర్వాత ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాత తర్వాత కడగేస్తే సరి. అలాగే కీర దోస ముక్కలు కూడా కట్ చేసి మీ కళ్ళపై ఉంచుకోవచ్చు.

ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఆ నీటిని ముఖం మీద నుంచి తుడవకుండా ఆరనివ్వండి. తర్వాత రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేసి అలాగే ఉంచండి.

ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ముఖంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.