uppula Raju |
Nov 22, 2021 | 7:10 PM
ఉదయాన్నే వాకింగ్ వెళ్లేందుకు సమయం దొరకని వారు చాలామంది ఉన్నారు. అలాంటివారు రాత్రి భోజనం చేసి వాకింగ్‌కి వెళ్ళవచ్చు.
రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్‌కు వెళ్లడం మంచి అలవాటు. బరువు కూడా అదుపులో ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు ఈ విధంగా బరువు తగ్గవచ్చు.
రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. రాత్రిపూట తినడం, నడవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.
మధుమేహం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ వ్యాధికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని నియంత్రించడానికి సులభమైన మార్గం వ్యాయామం చేయడం. రాత్రిపూట నడవడం అలవాటు చేసుకోవడం వల్ల మధుమేహం సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
రాత్రి భోజనం చేసి పడుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి రాత్రిపూట తిన్న తర్వాత 20 నిమిషాల పాటు నడవడం వల్ల మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.