ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్‌ తింటే ఆరోగ్యమే..! లాభాలు ఏంటంటే..

Updated on: Jun 30, 2025 | 11:50 AM

నానబెట్టిన అంజీర్ పండ్లను రోజూ తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అంజీర పండ్లు అందరికీ మేలు చేస్తాయి. నానబెట్టిన అంజీర్‌ను చిన్నారులకు అందిస్తే పిల్లలకి చాలా ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.. గర్భిణీలు కూడా వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి బయట పడొచ్చు అంటున్నారు. అయితే, నానబెట్టిన అంజీర్‌తో కలిగే మరిన్ని లాభాలు ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తినవచ్చా? వాటిని ఏ సమయంలో తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. భోజనం తర్వాత మీరు తీసుకునే ఫైబర్‌లో భాగంగా ఒకటి లేదా రెండు అంజీర్ పండ్లను తినవచ్చు. దీనివల్ల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఈ అలవాటును పాటిస్తే ఎంజైమ్‌లు విడుదలై జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

2 / 5
ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి అంజీర్‌ తినటం వల్ల మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్లు అంజీర్‌ తీసుకోవడం మంచిది.

3 / 5
పొటాషియం ఇందులో ఎక్కువ మోతాదులో ఉంటుంది. హైబీపీని కంట్రోల్ చేయడానికి అంజీర్‌ను తీసుకోవడం మంచిది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. చర్మ సమస్యలను నయం చేసి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

4 / 5
అంజీర్ పండ్ల గురించి ఎవరికి తెలియదు? అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని సరైన రీతిలో తిన్నప్పుడే వాటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అయినప్పటికీ, వాటిని ఎలా తినాలనే విషయం మాత్రం అందరికీ తెలియదు. కానీ వీటి ప్రయోజనాలు మనం వాటిని తినే సమయంపై ఆధారపడి ఉంటుందట.

5 / 5
అంజీర్ పండ్లను నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోయి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.