
గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగడం వల్ల వారం రోజుల్లోనే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి, పాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం, విటమిన్ డి లభిస్తుందని.. ఫలితంగా ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలలో నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుంది.

నెయ్యి.. మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. కంటి చూపు మెరుగపడడానికి, కంటి ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను పొగొట్టడానికి కూడా నెయ్యి బాగా ఉపయోగపడుతుందన్నారు. శరీరానికి బలానిచ్చి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంపై పుండ్లు, గాయాలను త్వరగా తగ్గిస్తుంది. నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు.. రోజంతా శరీరాన్ని శక్తిమంతంగా ఉంచేలా చేస్తాయి.

ప్రతిరోజూ పడుకునే ముందు పాలలో నెయ్యి కలుపుకుని తాగితే బోలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ముఖ్యంగా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. నెయ్యి , పాలు కలిపి తీసుకోవటం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు నెయ్యి పాలు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

పడుకునే ముందు నెయ్యి కలిపిన పాలు తాగటం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది. ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అనే అమైనో ఆమ్లం ఉంటాయి. ఈ రెండూ నిద్ర నాణ్యతను పెంచడానికి సహాయపడతాయి. నిద్ర సమస్య ఉన్నవారు రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని వివరించారు.

పాలు, నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల చర్మం తళతళ మెరిసేలా చేస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంలో గ్లో వస్తుంది. పాలు, నెయ్యి రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోయి రోగనిరోధక శక్తి బలపడుతుంది. కడుపులో ఆమ్లం తగ్గి.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పని చేస్తుందని చెప్పారు. పాలతో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి..బరువు అదుపులో ఉంటుంది.